గౌహతి కేసులో 11 మందికి శిక్ష

గౌహతి : ఈ ఏడాది జూలై 9న గౌహతిలో ఒక బార్‌ ముందు యువతిని పలువురు ఆకతాయిలతో కూడిన బృందం వేధించిన కేసులో ఈరోజు 11  మందికి శిక్ష పడింది. మరో నలుగురిని తగిర సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వదిలివేశారు. నిందితులంతా బెయిల్‌మీద విడుదలై బయటే ఉన్నారు. తాము పై కోర్టుకు వెళ్తామని శిక్షపడిన నిందితులు పేర్కొనడం గమనార్హం. వీరికి విధించిన శిక్ష వివరాలు ఇంకా తెలియలేదు, వేధించిన సంఘటనను వీడియో తీసి యూట్యూబ్‌లో ఉంచడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 16గురిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీటు దాఖలు చేసింది.