గ్రామనేతల భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గ్రామ పెద్దల భద్రతపై ఈరోజు సమీక్ష జరుపుతున్నారు. బారాముల్లా జిల్లాలో ఒక సర్పంచిన కాల్చిచంపిన ఘటన అనంతరం శనివారం సోపోర్‌లో మరో మహిళా పంచాయతీ సభ్యురాలిపై గెరిల్లాలు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ముఖ్యమంత్రి మంత్రివర్గ, పార్టీ సహచరులతో జమ్మూలో ఇవాళ జరగాల్సిన విందును రద్దు చేసుకుని శ్రీనగర్‌ చేరుకున్నారు.