ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్‌: నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేడ్కర్‌ అభిమానులు, యువజన సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా వచ్చి పూలమాల వేశారు.