ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు.

 

– జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో…

బూర్గంపహాడ్ సెప్టెంబర్06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక నందు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో జర్నలిస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, తాసిల్దార్ భగవాన్ రెడ్డి, ఎస్సై పి సంతోష్, ఎంపీడీవో వివేక్ రామ్, మండల వ్యవసాయ శాఖ అధికారి శంకర్, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల తెరాస యువజన అధ్యక్షులు గోనెల నాని హాజరయ్యారు. మండలంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. అంతకుముందు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టు సోదరులకు అభినందనలు తెలియజేశారు. వరదల సమయంలో తమకు, తమతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సహకారం అందించారని పేర్కొన్నారు. మండల జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసేందుకు ఇళ్ల స్థలాలు కొరకు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.