ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం : దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ
మిర్యాలగూడ, జనం సాక్షి.తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భవ దినోత్సవం బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ నెల్లూరు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాలలో న్యాయం జరిగింది టిడిపి హాయంలోనే అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కాసుల సత్యం, మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి జడ రాములు యాదవ్, టి ఎన్ టి యు సి అధ్యక్షులు అంజిబాబు యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జానీ మియా ఎస్టీ సెల్ అధ్యక్షులు సైదా నాయక్, పట్టణ అధ్యక్షులు సయ్యద్, కార్మిక సంఘ నాయకులు పోనుగోటి వెంకటేశ్వరరావు, సూర్య, సైదులు, తదితరులు పాల్గొన్నారు.