ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి )జహీరాబాద్ పట్టణంలో ని స్థానిక మహేశ్వరి థియేటర్ లో ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత నాయకులు బండి సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా చేస్తున్నాం. రానున్న రోజులో పేద ప్రజలకు అండగా ఉండి వారికి అన్ని విధాలా సహాయం చేస్తాం. అలాగే ఎచ్ ఐ వి బాధితులకు అండగా నిలిచి వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని బండి సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆంజనేయులు, క్రాంతి, జనార్ధన్, అక్బర్, శ్రావణ్ సిబ్బంది, శ్రావణ్, అక్బర్, పాల్గొన్నారు.
.