ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జైపూర్లో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతోపాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. విద్యార్థులు రీట్ ప్రవేశ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.