చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల మందు త్రాగాడు. గమనించిన పొరుగులు హన్మంతరావును హుటాహుటిన వేములవాడకు తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయిస్తున్నారు. హన్మంతరావు కొలుకుంటున్నాడని, ప్రాణాలకు ప్రమాదంలేదని వైద్యులు తెలిపారు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు గతంలో తనయుడు ఇలాగే ఆత్మహత్యాయత్నాఇకి పాల్పడి కోలుకున్నాడు.