చందుర్తి మండలంలో విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు

చందుర్తి,జూన్‌17(జనంసాక్షి):
ప్రతీ యేటా చందుర్తి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో పత్తి పంట సాగు చేసేందుకు రైతులకుదొంగ చాటుగా స్మగర్లు నకిలీ పత్తి విత్త్తనాలు అమ్ముతు న్నారు. బీటీ విత్తనాల కొరత అమాయక రైతులకు అంటగట్టుతున్నారు. ప్రభుత్వం రాయితీపై పత్తి రైతులకు బీటీ విత్తనాలు రైతులకు అందించ డంలో విఫలమతుతుంది.చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి నకిలీ పత్తి విత్తనాల విక్ర యించేందుకు అడ్డాగా మారింది. అంధ్రావలస రైతులు నకిలీ బీటీ పత్తి విత్తనాలను అమ్మకు నేందుకు కొందరిని ఎజెంట్లుగా ఏర్పాటు చేసుకొ ని గ్రామాలకు విస్తరించారు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ పత్తి విత్తనాలను పట్టు కున్నారు. ప్రస్తుత అధికారులు నిఘా పెట్టడం లేరు. నకిలీలకు వ్యవసాయ అధికారులు మిలాక త్‌ అయినట్లు సమాచారం. చందుర్తి మండల కేంద్రంతోపాటు ఎన్గల్‌, మూడపల్లి, నర్సింగా పూర్‌, తిమ్మాపూర్‌, రామన్నపేట, మల్యాల, బండ పల్లి, సనుగుల, జోగాపూర్‌ తదితర గ్రామాల్లో జోరుగా నకిలీ పత్తి విత్తనాలు అమ్మకాలు జరుగు తున్నాయి. ఆంధ్రా వలస నకిలీల ఆగడాలను అది óకారులు చోద్యంగా చూస్తున్నారు. బీటీ పత్తి విత్తనాలను రైతులకు సర్కార్‌ అందించడంలేదని, పత్తి బీటీ మహికో విత్తనాలను రైతులకు అందిం చేందుకు ప్రభుత్వం అధికారులతో డ్రాలతో ఎంప ిక చేస్తున్నారు. కార్తె దాటితుండడా విత్తనాలు అందడంలేదు. రైతుల అవసరాన్ని, అమాయ కత్వాన్ని ఆసరచేసుకొని నకిలీ పత్తి విత్తనాల వ్యాపారాన్ని పెంచారు. అధికారులు పత్తి విత్తనాల నకిలీల వ్యవహరాన్ని పట్టించుకోవడంలేరు.