చంద్రబాబు ప్రకటనతో కాంగ్రెస్లో కలవరం
కడప, ఆగస్టు 3 : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను రాజ్యాధి కారంలో భాగస్వాములను చేసేందుకు 100 సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు పంపులు, గ్యాస్ ఏజెన్సీలను 37శాతం బీసీలకు ఇస్తామని ప్రకటించిందన్నారు. తెలుగుదేశం అధినేత ప్రకటనతోనే కేంద్రంలో కదలికలు వచ్చాయని చెప్పారు. ఇప్పటికైనా బీసీలు తమ పక్షాన ఉన్నారన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానవర్గం గుర్తించిందని చెప్పారు. చంద్రబాబుపై కాంగ్రెస్ నాయకులు పాలడుగు వెంకట్రావు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొక్కా పట్టుకోవాలని స్పష్టం చేశారు.