చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు


దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి. అంతేగాకుండా రూపాయి మారకవిలువ దిగజారిపోతోందని అంటున్నారు. పివి`మన్మోహన్‌ ద్వయం తెచ్చిన ఐఎంఎఫ్‌`ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలనే వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే మన్మోహన్‌ సర్కారు బాటలోనే మోడీ ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ఆ పార్టీలు పరస్పరం విమర్శించు కోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నిజంగా మాత్రం కాదు. ఇకపోతే దేశీయంగా పెట్రో,గ్యాస్‌ ధరల పెంపు వల్ల రావాణరంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కరోనా సంక్షోభంలోనూ దరల పెరుగుదలతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి.
దేశీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల రేట్లు మరింత హెచ్చి నిత్యావసర, వినియోగ వస్తువులు ఖరీదు కాక తప్పదు. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే మరిన్ని కష్టాలు తప్పవు. బ్యాంకు వడ్డీరేట్లు పెరగడం, రుణాలవిూద ప్రభావం వంటి సమస్యలు కూడా అనేకం. రూపాయి పతనమవుతున్నందున పెట్టుబడిదారులు డాలర్‌ సురక్షిత మైనదిగా భావించడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా తరిగి పోతున్నాయి. రూపాయి విలువ తగ్గుదలతో ఎగుమతులకు మేలు జరగవచ్చని కొందరంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, ఐరోపా మార్కెట్లలో విధించిన నిబంధనలవల్ల వాటికి ముప్పు ఏర్పడిన వాస్తవాన్ని విస్మరించరాదు. అంతేగాక దిగుమతుల భారం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని గుర్తించాలి. డాలర్లు మన దేశం నుంచి తరలి పోకుండా పరిమితం చేయడానికి విలాస వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం అన్న భావనా ఉంది. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాల వైపు ఇప్పటికైనా మళ్లాల్సి ఉంది. రూపాయి పతనం ఐటీ, ఎగుమతులు ఇత్యాది రంగాలకు మేలుచేస్తుందని అంటున్నారు కానీ, సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు. దిగుమతి చేసుకొనే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి.
సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ద్రవ్యమారక రేట్లతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావిత మవుతోంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చమురు ధరలకు నిర్ణయాత్మకమవుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతోందని 2014 ఎన్నికలకు ముందు మోడీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. అయితే రూపాయికి శస్త్రచికిత్స చేయకుండా దీనిని సాధించడం దుస్సాధ్యం. ఇది సాధిస్తే ప్రజలు ఎవరికి వారు ఆర్థికంగా ఎదగలరు. ఎవరి ఆరోగ్యం వారు చూసుకోగలరు. దివంగత ప్రధాని పివి నరసింహారావు మాత్రమే ఇలాంటి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన తీసుకున్న సాహసోపేత సంస్కరణలే ఇప్పటికీ మనకు రక్షగా నిలిచాయి.