చర్చలతో ముందుకు….

అడ్వాన్‌టేజ్‌ ఏపీ జాతీయ కంపెనీలకు అవగాహన సదస్సు
హైదరాబాద్‌: అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనంతరం అడ్వాంటేజ్‌ ఏపీ జాతీయ స్థాయి సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్యకంగా నిర్వహించింది. ఐటీ పరిశ్రమలను ఆకర్షించే దిశగా హెచ్‌ఐసీ ప్రాంగంణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సుకు పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలు, అవకాశాల పై వివిధ ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో కూలంకుషంగా చర్చించాయి. ఇదే వేదికగా ఐటీ రంగంలో యువతకున్న అవకాశాల పై ప్రభుత్వం పై పూర్తిస్థాయిఅవగాహన కల్పించింది.