చాయ్ జంక్షన్ టీ స్టాల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
కూకట్ పల్లి (జనంసాక్షి ): శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రధాన రహదారిలో జిల్లా వెంకటేష్ వారి కుమారులు జిల్లా సాగర్ లు నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ జంక్షన్ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కార్పొరేటర్ లు దొడ్ల వెంకటేష్ గౌడ్,నార్ని శ్రీనివాస్ రావులతో కలిసి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ఎంచుకొని ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వ్యాపారంలో వారు ఎదుగుదలను చూసుకోవడం సంతోషకరమన్నారు. నిర్వాహకులు ఈ వ్యాపారంలో కస్టమర్లు మన్ననలు పొందుతూ వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా యాజమాన్యం వారు వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.