చార్జిషీటు పరిశీలించాకే నిర్ణయం:బొత్స

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కుంభకోణం నిందితుల పేర్లలో మంత్రి ధర్మాన పేరు కూడా ఉన్నట్లు తాను మీడియా ద్వారనే తెలుసుకున్నాని అంతకుమించి ఏం తెలియదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. డిల్లీలో ఉన్న ధర్మన హైదరాబాద్‌ వచ్చాక మాట్లాతామని, చార్జిషీటు పరిశీలించి ధర్మాన తన పదవికి రాజినామా చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని బొత్స అన్నారు. ఆ విషయంలో ఆజాద్‌ కూడా తనతో మాట్లాడారన్నారు.