చావెజ్‌ ప్రమాణస్వీకారం వాయిదా

కారకాస్‌ : వెనిజులా అధ్యక్షుడి ప్రమాణస్వీకర కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన చావెజ్‌ క్యూబా ఆసుపత్రిలో వూపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పోందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.చావెజ్‌ సుప్రీం కోర్టు ముందు ప్రమాణం చేస్తారని ఉపాధ్యక్షుడు నికోలన్‌ మడురో వెల్లడించారు. ముందు నిర్ణయించిన ప్రకారం చావెజ్‌ గురువారం జాతీయ అసెంబ్లీ ముందు ప్రమాణం చేయాలి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ కార్యాక్రమాన్ని వాయిదా వేశారు. మరోవైపు రాజ్యంగ నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.