చికెన్‌గున్యా జ్వరంతో గ్రామస్థుల అవస్థలు

బాలానగర్‌: బాలనగర్‌ మండలం మోతి ఘనపూర్‌ గ్రామంలో 40 మందికి పైగా చికెన్‌గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఇంటింటా ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడ్తున్న వారిని బుధవారం మధ్యాహ్నం జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ పరామర్శించారు. అనంతరం ఆయన జిల్లా వైద్యాధికారితో మాట్లాడి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.