చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు వేసిన చిట్టీ డబ్బులు సుమారు రూ. 11 కోట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు వెంకటేశాన్ని అరెస్టు చేశారు.