చిన్నారి కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు

చీపురుపల్లి: కుమారుడు చనిపోయి పుట్టెడుదు:ఖంలో ఉన్నా వారు సామాజిక బాధ్యత మరువలేదు. చనిపోయిన తమ ఏడాది కుమారుడు ప్రణీత్‌ కళ్లను వారు దానం చేశారు. జి.ఆగ్రహారం గ్రామానికి చెందిన గణేష్‌, సంధ్యారాణిల కుమారుడు ప్రణీత్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాలుడి కళ్లను వారు మానవీయతా సంస్థద్వారా దానం చేశారు. స్థానికులు వారిని అభినందించారు.