చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అక్టోబర్‌ 2 లోగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిరంజివి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలున్నాయని కోర్టు పేర్కోన్నట్లు సమాచారం.