చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ :మానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి చిరుధాన్యాలు అత్యంత ఆవశ్యకమని దిర్శించర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన “పోషణ పక్షోత్సవం” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,ప్రభుత్వం మార్చి 20 నుండి ఏప్రిల్ 3 వరకు “పోషణ పక్షోత్సవం” నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ప్రపంచానికి చిరుధాన్యాలను పరిచయం చేసిన ఘనత భారతదేశానిదే అని,మంచి ఆరోగ్యానికి అందరూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని కోరారు.గ్రామ సర్పంచ్ మాగంటి మాధవి మాట్లాడుతూ ప్రజలు ముఖ్యంగా గర్భిణిలు,బాలింతలు బాలికలు పోషకాల లోపం లేకుండా చిరుధాన్యాలు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు, గుడ్డు నిత్యాహారంలో తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఎస్ హెచ్చెం కట్టా మాధవి,కార్యదర్శులు రమాదేవి,నరసింహారావు, ఏఎన్ఎం జానమ్మ,అంగన్వాడీ టీచర్స్ ఎన్.ఎలిజబెత్,టి వెంకటరమణ, వి.చంద్రకళ, ఉపాధ్యాయులు జి.శ్రీదేవి,వి శ్రీనివాసరావు, జె.శ్రీనివాస్,ఏ. అశోక్ కుమార్,ఎం.యాదగిరి, ఎస్.కె సబియా,బి.వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.