చీటింగ్ కేసులో ముగ్గురు రిమాండ్

share on facebook
మల్దకల్ ఆగస్టు 5 (జనంసాక్షి) ధరూరు మండలం ఓబులోనుపల్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద సవరన్న చిన్నమ్మ గోవిందమ్మకు మల్దకల్ మండలం బిజ్వారం శివారులోని 462/క సర్వే నెంబర్లో ఉన్న ఐదు  ఎకరాల భూమిని భాగ పరిష్కారం చేసుకొని చెరి సగం ఖాస్తులో ఉన్నారు.కానీ రికార్డ్ మాత్రం సవరన్న అవ్వ అయినా  సవరమ్మ పేరు మీద కలదు. సవరమ్మ మరణానంతరం అట్టి మొత్తం భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఆలోచనతో పెద్ద సవరన్న,అదే గ్రామానికి చెందిన కురువ పరశురాముడు,దాసరిపల్లి గ్రామానికి చెందిన మీసేవ నిర్వాహకుడు వీరేశ్ అలియాస్ అవని శ్రీ తో కలిసి చనిపోయిన వారి నాన్న నాగన్న ఆధార్ కార్డును సవరమ్మ రికార్డుకు లింకు చేసి ఆ తర్వాత తహసిల్దార్ జారీ చేయబడే ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండా గానే వారసులు ఉన్న విషయాన్ని దాచి పెట్టి అట్టి మొత్తం భూమిని సవరన్న అమ్మగారు అయిన నరసమ్మ పేరు మీదికి మోసపూరితంగా విరాసత్ చేయడం జరిగింది. గోవిందమ్మ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పై తెలిపిన వ్యక్తులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ పంపగా గద్వాల జడ్జి ముగ్గురిని జైలుకు పంపినట్లు ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.

Other News

Comments are closed.