చెన్నై ఓపెన్‌ స్క్వాష్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు జోత్స్న ,అలకమోనీ

చెన్నై మే 24 :

చెన్నై ఓపెన్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిఫ్‌ లో క్వార్టర్‌ ఫైనల్లోకి జోత్స్న చిన్నప్ప ,అనక అలమోనీలు దూసుకెళ్లారు.బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో జోత్స్న చిన్నప్ప ఈజిప్టు కు చెందిన నౌరాన్‌ అహ్మద్‌ గోహర్‌ను 11-8,11-9,5-11,11-7 , గేముల తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.ఇదే విధంగా అనక అలకమోనీ మలేషియా క్రీడాకారిణి జుల్హీజా బింటీ అజన్‌పై 4-11,11-0, 11-5, 4-11,11-8 గేముల తేడాతో విజయం సాధించింది. అయితే నేషనల్‌ జూనియర్‌ ఛాంపియన్‌ హర్షిత్‌ కౌర్‌ (ఢిల్లీ) తో పాటు భారత క్వాలిఫయర్లు ఓటములతో ఈ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించారు.