చెరువులను తలపిస్తున్న రోడ్లు.
– రోడ్డుపై గుంతలు, బురద నీరు పట్టించుకోని గ్రామ పంచాయతీ.
– బీటీ రోడ్డు మొదలుకొని పలు రోడ్లు అస్తవ్యస్తంగా…
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 11 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం మసీదు రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు బురద నీరు తో నిండి వాహనదారులు భయంతో వాహనాలు నడపవలసిన పరిస్థితి, పాదచారుల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు, కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మసీదు రోడ్డులో ఎన్నో రోజులుగా బురద నీరు ఉన్న పట్టించుకోని అధికారులు. గ్రామంలో బీటీ రోడ్డు మొదలుకొని పలు రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలపడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.