ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు సీఆర్‌పీఎఫ్‌  జవాన్లకు, ముగ్గురు మావోయిస్టులకు  తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ తరలించారు. ఇంకా  ఎదురుకాల్పులు కొనసాగున్నాయి.