జగన్‌ను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఎస్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం విచారించనున్నరు.పీఎంఎల్‌ చట్టం కింద జగన్‌ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఈడీ అధికారులు సీబఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు ఈనెల 7వ తేదీ నుంచి 21వ తేది వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ విచారించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీనికి అనుగుణంగా ఈడీ అధికారులు ఇప్పటికే జగన్‌ను విచారించేందుకు సిద్దమయ్యారు.ప్రస్తుతానికి శుక్రవారం ఒక్కరోజే జగన్‌ను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు.