జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు నిత్యవసర సరుకుల పంపిణీ
జనం సాక్షి
నిర్మల్ బైంసా
02/09/22
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు నిత్యవసర సరుకుల పంపిణీ
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బైంసాలోని వివేకానంద అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నుంచి పండ్లు అదేవిధంగా నిత్యవసర సరుకులను అందించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేనఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేటా మహేష్.జనసేన యువకులు చంద్రే విశాల్. చంద్రే సచిన్. గణేష్. గిరి యోగేష్. మనోహర్. నవీన్. రమేష్. అదేవిధంగా ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్. జాంబులేకర్ సురేష్. కళాకారుల నిర్మల్ జిల్లా అధ్యక్షులు కొత్తూరు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని బియ్యం సంచిని అందించడం జరిగింది. సుంకేట మహేష్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ముందుకు ఎదగాలని సినిమాల పరముగా మరెన్నో సినిమాలు తీస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని తెలిపారు. చంద్ర విశాల్ మాట్లాడుతూ పవన్ చేసే పనులు అదేవిధంగా ఈ తరంలో మాకు భగత్ సింగ్ లాగా కన్పించడని అందుకే యువకుల్లో అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో చీకటి నుండి వెళ్తురు నింపే సూర్యుడులా కనిపించాడని అందుకే మేమంతా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు మోయమని తెలిపారు. వాడెక్కర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తూరు శంకర్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ప్రజలలో పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజలకు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తామని పిలుపునిచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు