జలప్రభలో ఐదు ఎకరాల భూ అభివృద్ధికి అనుమతి

శ్రీకాకుళం, జూన్‌ 24 : ఇందిర జలప్రభ కార్యక్రమంలో ఎస్పీ, ఎస్టీ లబ్ధిదారులకు ఐదు ఎకరాల భూమి అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.కల్యాణచక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఒకేచోట పది ఎకరాల భూమి ఉంటే దానిని అభివృద్ధి చేసుకునే సౌకర్యం ఉండేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారులకు ఐదు, అంతకంటే ఎక్కువ ఎకరాలు ఒకేచోట ఉంటే వాటిని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అటువంటి లబ్ధిదారులు మండల ప్రత్యేకాధికారి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిని సోమవారం సంప్రదించాలని కోరారు. ఈ పథకం కింద భూమిని అభివృద్ధి పర్చడం, బోరుబావి ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుద్దీకరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ భూముల్లో పండ్లతోటలు పెంపకాన్ని ప్రోత్సహించి ఎకరాకు కనీసం రూ.18 వేలు ఆదాయం తగ్గకుండా వచ్చేందుకు రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు.