అన్నదాతలకు అండగా ఉంటాం
` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం
` రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం
` ఇందిరమ్మ ఇల్లు వేగంగా నిర్మించుకోండి
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో సంపదను పెంచుతాం, పంచుతాం.. గద్దలు, డేగలు .. రాబందులను దరిదాపుల్లోకి రానివ్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలోని మహిళా సంఘాల సభ్యులకు 5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మొదటి సంవత్సరం 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తాం అంటే ఆనాడు హేళన చేశారు, కానీ మేం లక్ష్యాన్ని మించి 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లులు త్వరగా పూర్తి చేసుకోండి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర చేపట్టగా ప్రతి చోట మాకు ఇల్లు ఇప్పించండి ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లు పరిపాలించిన వారు ఇల్లు ఇవ్వలేదు మేం అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి ఐదు లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు 22,500 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు.రైతులు, పేదల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్ల బడ్జెట్లో 1,21, 874 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది ఈ అంశాన్ని దష్టిలో పెట్టుకొని రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల కోసం 74,163 కోట్లు నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, కళ్యాణ లక్క్ష్మి వంటి పథకాలు పేద వర్గాల సంక్షేమం కోసం చేపట్టి 47,710 కోట్లు నేరుగా రైతులు, పేదల చేతికి ప్రజా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం ఇ 0దుకుగాను ప్రభుత్వం ఇప్పటివరకు మహిళల పక్షాన ఆర్టీసీకి ?7,000 కోట్లు చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలు పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేందుకు కూడా పనికిరావు కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆడబిడ్డ ఇంటికి నాణ్యమైన చీరను బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కిలో ధర 55 రూపాయలు పలుకుతుండగా ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రవ్యాప్తంగా 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం జిల్లాలో అదనంగా 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు
కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే ఖమ్మం జిల్లాలో 2.79 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేశాయి అన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖమ్మం జిల్లాలో 1.98 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మున్నేరు పాలేరు లింకు ద్వారా 1.38 లక్షల ఎకరాలకు, నెహ్రూ ఎత్తిపోతల పథకం కింద 33,025 ఎకరాలకు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2500 ఎకరాలకు, మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని తెలిపారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల విÖదుగా పారుతున్న నదులు, ఏరుల నీరు వధాగా పోకుండా అడ్డుకట్టలు వేసి పొలాలకు నీళ్లు పారిస్తున్నాం అన్నారు. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు, మధిర బోనకల్లు మధ్య వైరా నదిపై, చింతకాని ముదిగొండ మధ్య మున్నేరు నదిపై ఆనకట్టలు నిర్మించామని తెలిపారు. కక్షలు కార్పన్యాలతో రగిలిపోయి.. ఎండిన బీడు భూములతో కూడిన ఈ ప్రాంతంలో జలసిరులు పారి రైతులు కంకులు ఏరుతుంటే, వడ్లు పండిస్తుంటే చూసి తన గుండె నిండా సంతప్తి మిగిలిందని తెలిపారు.



