హరీశ్‌రావుకు సిట్ నోటీసులు
` నేడు విచారణకు రావాలని ఆదేశం
` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం
` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా
` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆరఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ అధికారులు నోటీసులను జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు, నిందితులను ఇప్పటికే పలుమార్లు సిట్ విచారించింది.రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును సైతం ప్రత్యేక దర్యాప్తు బందం పలు మార్లు విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్‌ని కూడా ఫిల్ చేస్తూ సీపీ సజ్జనార్ నేతత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారం సేకరించిన ప్రత్యేకదర్యాప్తు బందం(సిట్) ఈ కేసులో మరో సారి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వత మరికొంతమందిని పిలిచి విచారిస్తోంది. తాజాగా బీఆరఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీల అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశం మొదట్లో తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసు ఉన్నతాధికారులపై పలు కేసులు నమోదు చేసింది. వారిలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు ఉన్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహారించిన ప్రభాకర్‌రావుపై ఈ కేసులో పలు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా ఫోన్?లు ట్యాప్? అయిన నేతలు ఈటల రాజేందర్, మహేశ్ కుమార్ గౌడ్, బండి సంజయ్ తదితర నాయకులను పిలిచి వాంగ్మూలం తీసుకుంది. సిట్? విచారణను ముమ్మరం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు సిట్ ఎదుట లొంగిపోయారు.
రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా: కేటీఆర్
మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిందంటూ ధ్వజమెత్తారు. “ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసినా, మళ్లీ హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోంది. హరీశ్‌రావును రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. దారుణ పాలనను నిలదీస్తున్నందుకే కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. మాకు చట్టం, కోర్టులపై గౌరవం ఉంది.. ఏ విచారణకైనా సిద్ధం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నారు.



