జహంగీర్‌ దర్గాను గతపాలకులు నిర్లక్ష్యం చేశారు

C

– మతసామరస్యానికి ప్రతీక

– వసతుల కల్పనకు కృషి

– సీఎం కేసీఆర్‌

– అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా ఇమ్మల్‌నార దగ్గరున్న జహంగీర్‌ పీర్‌ దర్గాపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భక్తులతో వసతితో పాటు, మౌలిక సదుపాయాలు కల్పించి దర్గాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఈ దర్గాను అనేక సార్లు సందర్శించానని, కేవలం ముస్లింలే కాకుండా అన్ని మతాల వారు అక్కడికి వెళ్తారు అని తెలిపారు. మత సామరస్యానికి ఇది ఎంతో నిదర్శనమని అన్నారు. ఎంతో ప్రాశస్త్యం, ఆదరణ ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందకపోవడం విచారకరమన్నారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికెళ్లి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. దర్గా సవిూపంలో ఉన్న ప్రభుత్వ భూమిని భక్తుల వసతి కోసం వినియోగించుకోవాలని చెప్పారు. దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. షాద్‌నగర్‌లోని జహంగీర్‌ పీర్‌ దర్గాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య, ఏసీబీ డీజీ ఏకేఖాన్‌, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛాదర్‌ను, ప్రత్యేక నగదు నజరానాను పంపింది. సీఎం కేసీఆర్‌ ఛాదర్‌ను, నగదు నజరానాను అధికారులకు ఇచ్చి అజ్మీర్‌కు సాగనంపారు. అంతకు ముందు ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, వక్ఫ్‌ బోర్డు సీఈవో అసదుల్లా ఛాదర్‌ను, నగదు నజరానాను అజ్మీర్‌కు తీసుకెళ్తున్నారు. గురువారంతో  అజ్మీర్‌ దగ్గా ఉత్సవాలు ముగియనున్నాయి.