పినపాక నియోజకవర్గం మార్చి 6 (జనం సాక్షి): మణుగూరు మండలం సాంబాయిగూడెం కు చెందిన. ఆంగ్ల ఉపాద్యాయుడు షేక్ మీరాహుస్సేన్ కు ఖమ్మంజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2020 ,ది బెస్ట్ లీడర్ అవార్డు ,బహుజన సాహిత్య అకాడమీ వారు అందించే జాతీయ అవార్డ్స్ లో భాగంగా డా.ఏ .పీ .జె .అబ్దుల్ కలాం జాతీయ అవార్డు కు ఎంపికయ్యారు . హైద్రాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం లో (బి.ఎస్ ఏ ) ఆదివారం బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు ఎంపిక పత్రాలను అందుకున్నారు .వృత్తి లో భాగంగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ,కో కరిక్యూలర్ ఆక్టివిటీస్ లో విద్యార్థులను చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం , ప్రవృత్తి లో సామాజిక భాద్యత, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా హరితాహారం లో మొక్కలను నాటడం ,సామాజిక చైతన్య ,సేవా కార్యక్రమాల నిర్వాహణ ,రక్త దానం ,మాస్కుల పంపిణి ,పారిశుధ్య కార్మికులకు సన్మానం వంటి కార్యక్రమాలకు గాను ఈ అవార్డును ప్రధానం చేస్తారు. మార్చి 13న తిరుపతి లో జరిగే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 5వ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భంగా సహోద్యోగులు ,గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్‌ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*