జానా అధిక ప్రసంగం శ్రీమండిపడ్డ టీఎన్‌జీవోలు

తెలంగాణపై మాట్లాడవద్దని డిమాండ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) :
తెలంగాణవాదుల నుంచి మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. పదవీ విరమణ చేసిన ఎన్జీవో సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ సన్మాన సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారంనాడు స్వామిగౌడ్‌కు తెలంగాణ నేతలు, ఇతర సంఘాలు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపిలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్జీవోలకు ఆగ్రహం కలిగించాయి. స్వామిగౌడ్‌ గురించి మాత్రమే మాట్లాడాలని, తెలంగాణ అంశంపై ప్రస్తావన తీసుకురావద్దని మంత్రి తెలంగాణ ప్రాంత ఎంపీలకు సూచించడంతో గందరగోళం ఏర్పడింది. ఆయన వ్యాఖ్యలపై టిఎన్జీవో ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండ ిపడ్డారు. జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అంటూ మండ ిపడ్డారు. దీంతో జానారెడ్డి తన వ్యాఖ్యలపై వివర ణ ఇచ్చుకున్నారు. సమయం వృథా కావద్దనే ఉద్దేశ్యంతోనే తాను కేవలం స్వామిగౌడ్‌ గురించి మాట్లాడమని సూచించామని చెప్పాను కాని అంతకు మించి ఏమీ లేదని చెప్పారు. అయి నప్పటికీ ఉద్యోగులు తగ్గలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు స్పందించి వారిని సముదా యించారు. ఈ నెల 6,7వ తేదీలలో ఢిల్లీ పెద్దల ను తెలంగాణ విషయమై కలుస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలన్నీ కేసిఆర్‌ చేతుల్లో ఉన్నాయని అధిష్టానం భావిస్తోందని అన్నారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మధుయాష్‌కి, గుత్తా సురేంద్రర్‌ రెడ్డి, మందాజగనాథం కె,కేసవరావు తదితరులు పాల్గొన్నారు.