ఫోన్ ట్యాపింగ్‌కేసులో కేటీఆర్‌పై ఏడు గంటల పాటు ప్రశ్నలవర్షం
` ఫోన్ ట్యాపింగ్‌లో ముగిసిన కేటీఆర్ విచారణ
హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆరఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు.. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అలాగే ఈ కేసులో నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, కేటీఆర్‌ను కలిపి గంట పాటు విచారణ చేసినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ విచారణ ముగియడంతో తదుపరి వంతు కేసీఆర్‌దేనని రాజకీయవరగాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు 22 సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందజేశారు.
ఇది లీకుల ప్రభుత్వం
` సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను
` ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు
` ప్రజల దష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు
` దుష్ప్రచారాలు నమ్మి తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల అసమర్థ పాలన నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకు కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన విÖడియాతో మాట్లాడారు.“సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించాను. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం. కేవలం లీకుల విÖద నడిచే ప్రభుత్వం. హీరోయిన్ల పేరుతో దుష్పచారం చేశారు.. అది నిజమేనా అని సిట్‌ను అడిగా. మేం అలాంటి వార్తలు విÖడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు. అడ్డగోలు లీకులను నమ్మి తప్పుడు వార్తలు ఇవ్వొద్దని విÖడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయని విÖడియాకు నా విజ్ఞప్తి. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ కావటం లేదా అని సిట్‌ను అడిగాను. విÖకు ఏ నటులు ఫిర్యాదు చేశారని సిట్‌ను ప్రశ్నించా. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారు. ఏవో కొన్ని పేర్లు చెప్పి.. వాళ్లు తెలుసా అని అడిగారు. మమ్మల్ని విచారించడంపై లీకులు వండి విÖడియాకు ఇస్తారు. ఈరోజు నన్ను ఎవరితోనూ కలిపి విచారించలేదు. ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు. మరోసారి విచారణకు పిలుస్తామంటే.. వస్తానని చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.
ప్రజల దష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు: కేటీఆర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పది సార్లు పిలిచినా హాజరవుతానని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పు చేయనపుడు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. నేడు సిట్ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విÖడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. “మంత్రులతో పాటు మా అందరి ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఆరు గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టం. కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు పోరాడతాం. సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాను. ఈ కేసులు మాకు కొత్తేవిÖ కాదు.. బెదిరింపులకు భయపడం. కొత్తనాటకాలతో కాలయాపన చేస్తున్నారు. నాపై లేనిపోని లింకులు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటాం. నా పరువుకు భంగం కలిగించిన రేవంత్, ఆయన తొత్తులను వదిలిపెట్టను” అని కేటీఆర్ అన్నారు.



