జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రవత్తము చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 27 (జనం సాక్షి); జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ అండ్ బి , నీటిపారుదల ,రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రియదర్శిని జూరాల డాం ద్వారా క్రిందకు వదిలే సమయంలో నది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీరు వచ్చాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాముల ద్వారా జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీరు ఇప్పటికి ఎన్ని గేట్లు తెరిచి కిందకు వదిలారని అడిగారు. ఇప్పటికే ఐదు గేట్ల ద్వారా నీటిని క్రిందకు వదిలినట్లు సంబంధిత అధికారి కలెక్టర్ కు తెలిపారు. జూరాల డాం కెపాసిటీని బట్టి నీరు చేరితే మిగతా నీటిని క్రిందకు వదిలితే చుట్టుప్రక్కలగ్రామాలకు సమస్య ఏర్పడితే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నది పరివాహ ప్రాంతాలలో చేపలు పట్టే వారిని వెళ్ళనీయకుండా బారికేడ్లు, సూచిక బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నది అగ్రహారం, బీచుపల్లి ప్రాంతాలలో ఒకరు అధికారిని అక్కడే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేనాల్స్, ఆర్ అండ్ బి రోడ్లు , ఎక్కడైనా డ్యామేజీ అయితే వాటిని వెంటనే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో విద్యుత్ ఎస్ఈ భాస్కర్, ఇరిగేషన్ డి ఈ శ్రీనివాసరావు రహీముద్దీన్ సీఈవో ముసాయిదా బేగం సిపిఓ లక్ష్మణ్ డిపిఓ శ్యాంసుందర్ ఆర్ అండ్ బి ప్రగతి, పి ఆర్ ఈ ఈ రామాంజనేయులు, ఆర్డీవో చంద్రకళ, తాసిల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.