జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

విజయవాడ, జూలై 21 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో జిల్లాలో సగటున 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వత్సవాయిలో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే జగ్గయ్యపేటలో 5 సెంటీమీటర్లు, నందిగామ, మైలవరంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ కూడా నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో 24 గంటల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

తాజావార్తలు