జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి..
ధర్మపురి ( జనం సాక్షి)జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే (బాలురు )ధర్మపురి కళాశాల విజయ దుందుభి………… మహాత్మ జ్యోతిబాపూలే సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడలలో అండర్-19 విభాగంలో కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. దీనిలో భాగంగా వాలీబాల్ క్రీడలో, మొదటి స్థానాన్ని ఖోఖో క్రీడలో ద్వితీయ స్థానాన్ని మరియు అథ్లెటిక్స్ లో మొత్తం 24 పథకాలను 13 బంగారు పథకాలు,6 వెండి పతకాలు మరియు 5 కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. వీరిలో A. హరీష్ అనే విద్యార్థి ఏకంగా 7పథకాలను,P. శ్రీశాంత్ మూడు పథకాలను సాధించడం జరిగింది. అలాగే M.రాజశేఖర్ అనే విద్యార్థి 7 పథకాలతో పాటు వ్యక్తిగత ఛాంపియన్షిప్ ను సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ A. రాధా కిషన్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి రావడం తమకు చాలా సంతోషాన్ని కలిగించిందని సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని విద్యార్థులందరూ చదువుతోపాటు క్రీడల్లో రాణించి దేశ కీర్తి ప్రతిష్టను పెంచాలని తెలిపారు దీనికి కృషిచేసిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అంజయ్యను ప్రత్యేకంగా అభినందించారు దీనితోపాటు తమ కళాశాలకు అండర్ 19 విభాగంలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ రావడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ A. రాధాకృష్ణన్ , స్తంభం పెళ్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ J.రాజేశం ,ఫిజికల్ డైరెక్టర్ అంజయ్య ,వైస్ ప్రిన్సిపాల్ G. శ్రీకాంత్ డిప్యూటీ వార్డెన్ L. రవి మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.