జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం
శ్రీకాకుళం, జూలై 29: జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం పట్టణంలో ఆందంగా తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించడం ద్వారా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.