జుక్కల్ లో గర్భిణిలకు ఆరోగ్య అవగాహన

 

 

 

 

జుక్కల్, సెప్టెంబర్2,జనంసాక్షి,
జుక్కల్ మండల ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో జుక్కల్ క్లస్టర్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం గర్భిణీలకు ఆరోగ్యం పై అవగాహన కల్గించారు. పండ్లు పంపిణీచేశారు. ఈ సందర్బంగా ఐఆర్సీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ విక్రమ్ మాట్లాడుతు గర్భిణీ లు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు లాంటి సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు. వేళకు భోజనం చేయాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఐఆర్సీఎస్ చైర్మన్ ఉమాకాంత్ ,ఐఆర్సీఎస్ నాయకులు చంద్రకాంత్, నరేష్ సెట్, అవినాశపటెల్, సతీష్ వాసరే, డాక్టర్ శేషి ఆసుపత్రి షిబ్బంది యోగేష్,అంబికా, ఆశాలు, గర్భవతులు పాల్గొన్నారు.