జుట్టు కత్తిరించిన ప్రిన్సిపల్‌

బర్వాని: మధ్యప్రదేశ్‌ బర్వానిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కటింగ్‌ చేయించుకోమని చెబుతున్నా వినని విద్యార్థులకు ఏకంగా ప్రిన్సిపల్‌ జుట్టు కత్తిరించారు. దీంతో తమ జుట్టు అన్యాయంగా కత్తిరించారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3న ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌ చంద్ర శర్మ తమ జుట్టు కత్తిరించారంటూ ఆ విద్యార్థులంతా మీడియాకు ఓ లేఖ రాశారు. అయితే నెలన్నర నుంచి జుట్టు కత్తిరించుకోమని చెబుతున్నా విద్యార్థులు వినిపించుకోలేదని అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని శర్మ అంటున్నారు. ఘటనపై తహసీల్దారు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు తెలిపారు.