జులై రెండో వారంలో విద్యా వారోత్సవాలు

హైదరాబాద్‌: జులై 9నుంచి 21వ తేది వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.2వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒకేరోజు 5వందల పాఠశాల భవనాలు, 9వేల అదనపు తరగతి గదులకు శంకుస్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.