జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరదినం సందర్భంగా నిరసన తెలుపుతామని టీఆర్‌ఎస్‌, జేఏసీ ప్రకటించడంతో పోలీసులు అరెస్టులకు తెరలేపారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరాం హౌస్‌ అరెస్టును టీఆర్‌ఎస్‌, ఉద్యోగసంఘాల కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని వారు మండిపడ్డారు. గన్‌పార్క్‌ వద్ద నిరసన తెలుపుతామని వారు పేర్కొన్నారు.