జేఏసీ పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జేేఏసీ డివిజన్‌ కోఆర్డీనేటర్‌ షేక్‌ జావీద్‌ మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడదాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామన్నారు. తెలంగాణ వాదులంతా ఆత్మ బలిదానాలకు స్వస్తి చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. ఈ పాదయాత్రను జేఏసీ చైర్మన్‌ కోదండరాం సీమాంధ్రులకు సరైనబుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల సునీల్‌, జహంగీర్‌, బుచ్చయ్య, రఫీ, రహిం, యాకూబ్‌ పాష, శ్యాంప్రసాద్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.