జోరుగా గనులపై ద్వార సమావేశాలు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనం సాక్షి)

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా సోమవారం యైటింక్లయిన్‌కాలనీ పరిధిలోని పలు బొగ్గుగనులపై కార్మిక సంఘాలు పోటాపోటీగా గేట్‌మీటింగ్‌లు నిర్వహించాయి. ఇఫ్టూ ఆధ్వర్యంలో ఓసిపి-3లో గేట్‌మీటింగ్‌ నిర్వహించగా… ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర అద్యక్షులు టి.శ్రీనివాస్‌, నాయకులు ఎస్‌కె.బాబు, నరేష్‌, వెంకన్న, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆద్వర్యంలో… వకీల్‌పల్లె గ్రామంలో ద్వారసమావేశాన్ని నిర్వహించగా… ఈ కార్యక్రమంలో నాయకులు వై.యాకయ్య, ఎస్‌.వెంకన్న, మొగిలి, తిరుపతి, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే టిబిజికేఎస్‌ ఆధ్వర్యంలో యైటింక్లయిన్‌ బొగ్గుగనిపై జరిగిన ద్వార సమావేశంలో నాయకులు కెంగర్ల మల్లయ్య, శ్రీనివాస్‌, చంద్రమౌళి, సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, బిఎంఎస్‌ ఆధ్వర్యంలో… ఓసిపి-1లో జరిగిన గేట్‌మీటింగ్‌లో వేజ్‌మెంబర్‌ సురేందర్‌ కుమార్‌ పాండే, నాయకులు వేణుగో పాల్‌రావు, రవీందర్‌రావు, రామ్మోహన్‌రావు, కొమురయ్య,  సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.