టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
కొలంబొ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ అప్పగించింది. నేటి మ్యాచ్‌కి తుది జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, అశ్విన్, తివారీ, జహీర్‌కు స్థానం దక్కలేదు. హర్భజన్, చావ్లా, అశోక్ దిందా తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.



