టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ యూనియన్ సమావేశం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి): టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ యూనియన్ సమావేశం హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు టిఆర్ఎస్కెవి అనుబంధ సంఘం ఫ్రూట్స్ యూనియన్ అధ్యక్షులు నాగేందర్ అధ్యక్షతన సమావేశం జరిగిందన్నారు. గురువారం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నియోజవర్గ కార్మిక సంఘాల అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ యూనియన్ సమస్యల మీద చర్చించడం జరిగిందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. త్వరలో తోపుడుబండ్లు వ్యాపారస్తులకు రోడ్డు పక్కన రహదారులకు ఇబ్బంది లేకుండా చిన్న చిన్న రేకు షెడ్లు గవర్నమెంట్ స్కూల్ దగ్గర, కొన్ని పరిసరాలలో వ్యాపారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించవలెనని తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి కృషితో వ్యాపారస్తులకు ఇంటిగ్రేడ్ నిర్మాణం జరుగుతున్నది త్వరలో అయిపోతుందని తెలిపారు. అందరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తానని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగేందర్, ఉపాధ్యక్షులు ఎ స్.కె ఉస్మాన్, ప్రధాన కార్యదర్శి బాణావతి వెంకటేశ్వర్లు, ప్రధాన కోశాధికారి లక్కం వెంకన్న, యూనియన్ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.