టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలి
యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం( జనం సాక్షి) న్యూస్ సెప్టెంబర్10
టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలి
తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న గట్టు తేజస్వి నిఖిల్
టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామ గ్రామంలో ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పనిచేయాలని టిఆర్ఎస్ యువ నాయకుడు గట్టు తేజస్వి నిఖిల్ అన్నాడు శనివారం తుర్కాపల్లి మండలం మల్కాపురం ఎంజి బండల్ వీరారెడ్డిపల్లి దత్తాయిపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఈనెల 21న సోషల్ మీడియా విద్యార్థి యూత్ విభాగాల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామాల నుండి అధిక సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొమ్మిశెట్టి నరసింహులు, ఎంపీటీసీ గిద్ద కరుణాకర్, సర్పంచులు పోగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ ,కల్లూరి ప్రభాకర్ రెడ్డి ,ఉప సర్పంచ్ సీత రాజు యాదవ్, నాయకులు భూక్య రవీందర్ నాయక్, బాలకృష్ణ, నల్ల శ్రీకాంత్, పాంగల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area