* టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. సిపిఐ మండిపాటు*
జనం సాక్షి నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ జిల్లా రైతులకు వరప్రసాదమైనటువంటి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుకు కాలువలకు లైనింగ్ వేయడం, కాలువ తూములకు షటర్లు పెట్టకపోవడం గాని, పారుదల కాలువలను నిర్మించకుండా, నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం భూమి లేనటువంటి రైతులకు భూమిని ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. జిల్లాను విద్యాపరంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని ఒక ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, మరియు ఐటిఐ లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కొనియాడారు .కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను ఒక లేబర్ కోడ్ గా విరమించుకొని ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటి కరణను ఆపాలని ప్రధాన ధ్యేయంగా సిపిఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్. ఆనంద్ వార్ల వెంకటయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్, తదితరులు పాల్గొన్నారు