టిడిపిని వీడేది లేదన్న తోట

అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  తెదేపాను వీడుతారంటూ వస్తున్న వార్తలను రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ తాను తెదేపాలో కొనసాగుతానని చెప్పారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో చర్చిస్తానని.. కార్యకర్తల అభీష్టం మేరకే వెళ్తానని ఎక్కడా చెప్పలేదని త్రిమూర్తులు స్పష్టం చేశారు. మరోవైపు చీరాల వైకాపా నేత ఎడం బాలాజీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. మొన్నటి వరకు తెదేపాలో కొనసాగిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైకాపాలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ వైకాపా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బాలాజీ చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజావార్తలు