టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పోలీట్‌బ్యూరో సమావేశం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతోంది. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర, సీమాంధ్ర పార్టీల వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుంది.