టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం
హైదరాబాద్ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల ఎన్‌ఎంయూ ఏకఛత్రాధిపత్యానికి తెరదించింది. స్పష్టమైన విజయంతో ఈయూ రాష్ట్రస్థాయి గుర్తింపును సాధించుకోగా తెలంగాణ రీజియన్ టీఎంయూ స్థానిక గుర్తింపును సొంతం చేసుకుంది. హైదరాబాద్‌తో సహా 11 రీజియన్లలో ఈయూ-టీఎంయూ కూటమి మెజారిటీ గెలుపు సాధించింది.